Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పందాలు, జూదాల జోలికి పోవద్దు.