జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తును విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ ప్రణాళికలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.