జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. బాధ్యతగా వ్యవహరించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. పనుల సానుకూలమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు అశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. వాహనం ఇతరులకివ్వొద్దు.