వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. దూరపు బంధువులతో తరచు సంభాషిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి.