జాతకం

మీనం
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వేడుకలు, సన్మాన సభల్లో పాల్గొంటారు.