జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతబిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ మాసం శుభదాయకం. ఆహ్వనం అందుంకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విమర్శలు అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. పనులు అనుకున్నంత విధంగా పూర్తికాగలవు. బంధువులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. వ్యాపాకాలు అధికమవుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాయ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు.