జాతకం

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. వేడుకలకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ధన ప్రాప్తి, వాహన యోగం వున్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు పదోన్నతి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.