జాతకం

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారానుకూలత వుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలగిపోతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనకు సమయం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతం నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది.