Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆత్మీయుల హితవు మీపై మంచిప్రభావం చూపుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. చేతివృత్తులు, కార్మికులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.