Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధనలాభం వుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.