Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అధికం. అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. శకునాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. సామరస్య ధోరణితో మెలగండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వృత్తి, ఉపాధి పధకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కొత్త సమస్యలెదురవుతాయి.