Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీ ఓర్పునకు పరీక్షా సమయం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయం అంతంతమాత్రమే. ఖర్చులు అధికం. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ వహించండి. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. జూదాల జోలికి పోవద్దు.