మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఏ విషయంలోనూ వెనుకడుగు వేయొద్దు. అవకాశం చేజారినా నిరుత్సాపడవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు సాయం చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. విందులు, దైవకార్యాలకు హాజరవుతారు.