జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ మాసం అనుకూలదాయకం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. యత్నాలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.