జాతకం

మేషం
మేష రాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. వ్యవహారానుకూలత ఉంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం, అధికారులకు కొత్త బాధ్యతలు. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. పోటీలు, పందాలు ఉల్లాసం కలిగిస్తాయి.