మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
విశేషమైన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలకు అడ్డుతగులుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వివాహయత్నం లిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. సంతానం అత్యుత్సాహం కట్టడి చేయండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగ విధులపై దృష్టిపెట్టండి. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం.