Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయుల ప్రోత్సాహం మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. చేతివృత్తులు, కార్మికులకు అవకాశాలు లభిస్తాయి.