Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు బుద్ధిబలంతో యత్నాలు సాగించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. ప్రతికూలతలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు నియంత్రించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురైనా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీ ప్రమేయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష ధోరణి తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు నిరాశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు.