కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పని అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహార లావాదేవీలతో సతమతమవుతారు. ప్రతి విషయం స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సలహాతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.