Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం అనుకూలదాయకం. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మీ జోక్యం అనివార్యం. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.