Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.