Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం కలిసివచ్చే కాలం. బుద్ధిబలంతో లక్ష్యం సాధిస్తారు. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. రాని బాకీలు వసూలు కాగలవు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు.