Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పరస్సరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అవేశాలకు లోనుకావద్దు. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలాభసాటిగా సాగుతాయి.. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు.