Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట, ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఇంచుమించుగా ఫలిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మునుపటి కంటే చురుకుగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో తంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి. సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. శుభకార్య యత్నాలు మొదలెడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆస్తివివాదాలు కొలిక్కివస్తాయి.