Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష గ్రహబలం స్వల్పంగానే ఉంది. ఆచితూచి అడుగు ముందుకేయండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అభిప్రాయం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆప్తులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక చర్చల్లో పాల్గొంటారు.