Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థిక విషయాల్లో విశేష ఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపుచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.