వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. శుభకార్యం తలపెడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.