కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆత్మీయులను తరుచుగా కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది.