మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పన్ను చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు అవగాహనకు రాగల్గుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో మరింత మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధపెట్టండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో ఉన్నత పదవులు లభిస్తాయి.