Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.