Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-11-2019 శనివారం మీ రాశి ఫలితాలు.. ఈ రోజు ఏం జరిగినా మంచికేనని?

16-11-2019 శనివారం మీ రాశి ఫలితాలు.. ఈ రోజు ఏం జరిగినా మంచికేనని?
, శనివారం, 16 నవంబరు 2019 (06:00 IST)
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు శుభదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించకపోవడంతో ఆందోళనకు గురవుతారు. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం: మనుషుల మనస్తత్వము తెలిసి మసలు కోవడం మంచిది. అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మ నిగ్రహం వహించడం మంచిది. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం. రిప్రజెంటేటివ్‌లకు, పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. 
 
మిథునం: కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. గృహ నిర్మాణాల్లో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి పనిభారం అధికం. మీ తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం, మీరు ఆశించే వ్యక్తుల నుంచి కావలసిన సమాచారం అందుతుంది. అనుకున్నవి సాధించి ఎనలేని తృప్తిని పొందుతారు. 
 
సింహం: ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కానవచ్చినా ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ఊహించని ఖర్చులు వుంటాయి. 
 
కన్య: ఉద్యోగస్తులకు అధికారులతో ఆకస్మికంగా పర్యటించాల్సి వస్తుంది. మీ కళత్రమొండి వైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
తుల: సోదరి, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీ వాహనం లేక విలువ వస్తువులు ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం: టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ధనం బాగా వ్యయం చేసి అయిన వారిని సంతృప్తి పరుస్తారు. రవాణా రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు: రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వల్ల రాజకీయాల్లో వారు కుదుటపడతారు. ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఉపాధ్యాయులు ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. 
 
మకరం: బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. మీ కోపతాపాలు అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం: మీ పట్టుదల వల్ల శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కొంటారు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికం. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. విద్యార్థుల్లో మందకొడితనం పెరుగుతుంది.

మీనం: ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మీదే పైచేయిగా వుంటుంది. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. మీ మాటలు, అభిప్రాయాలు ఎదుటివారికి నచ్చకపోవచ్చు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు... గతంలో ఇనుప మేకులు కూడా...