Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హింసాత్మకంగా మారిన భారత్ బంద్... నలుగురి మృతి

భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ దళిత సంఘాలు సోమవారం ఈ బంద్‌ను నిర్వహించాయి. అయితే, ఇది హింసాత్మకంగా మారింది.

హింసాత్మకంగా మారిన భారత్ బంద్... నలుగురి మృతి
, సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:09 IST)
భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ దళిత సంఘాలు సోమవారం ఈ బంద్‌ను నిర్వహించాయి. అయితే, ఇది హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా, మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మొరేనాలో ఒకరు, భింద్‌లో ఒకరు దుర్మరణం చెందగా గ్వాలియర్‌లో మరొకరు మృతి చెందారు. మొరేనాలో రాహుల్ పాతక్ అనే వ్యక్తి తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా... అదే ప్రాంతంలో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్ వెళ్లి రాహుల్‌కి తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
 
ఇకపోతే, భింద్‌లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపారు. దీంతో మహవీర్ రజావత్ అనే ఆందోళనకారుడు బుల్లెట్ తగిలి చనిపోయాడు. ఇదే జిల్లాలోని మచ్చంద్‌లో జరిగిన ఘర్షణల్లో మహవీర్ కుష్వా అనే ఆందోళన కారుడు మృతిచెందాడు. గ్వాలియర్‌లో జరిగిన కాల్పుల్లో మరోవ్యక్తి మృతిచెందాడు. గ్వాలియర్ ఘర్షణల్లో దాదాపు 19 మంది గాయపడగా... వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.
 
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు గ్వాలియర్, మొరీనా పట్టణాల్లో హింస తలెత్తడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆగ్రాలో నిరసనకారులు రాళ్లతో విరుచుకుపడగా.. మీరట్‌లో కార్లు, బస్సులకు నిప్పు పెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహానికి హాపూర్‌లో అనేక షాపులు ధ్వంసమయ్యారు. బీహార్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పంజాబ్‌లోనూ ఘర్షణలు తలెత్తడంతో పంజాబ్‌లో జరుగుతున్న సీబీఎస్ఈ పరీక్షలు నిలిపివేసి భద్రత కట్టుదిట్టం చేశారు.
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భారత్ బంద్ జరిగింది. ముఖ్యంగా, తిరుపతిలో వామపక్షాలతో పాటు.. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పటు చేయడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఐ నుంచి 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ఇంకా రంగు మారే స్మార్ట్ ఫోన్ కూడా?