Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశాల్లో సాహో.. కీలక సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్ కోసం..?

బాహుబలి హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ''సాహో''. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ దుబాయ్‌లో జరుగనుంది. ఇందుకోసం సినీ

విదేశాల్లో సాహో.. కీలక సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్ కోసం..?
, సోమవారం, 2 ఏప్రియల్ 2018 (11:48 IST)
బాహుబలి హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ''సాహో''. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ దుబాయ్‌లో జరుగనుంది. ఇందుకోసం సినీ యూనిట్ ఇప్పటికే అబుదాబికి ప్రయాణమైంది. అబుదాబిలో45 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుగనుంది.
 
ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేయనున్నారు. అబుదాబిలో షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది. అక్కడ బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో రిస్కీ ఛేజింగ్ సీన్ల చిత్రీకరణ వుంటుందని తెలుస్తోంది. 
 
ఈ యాక్షన్ బ్లాక్‌లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా పాల్గొంటుంది. దుబాయ్ నుంచి సాహో టీమ్ రొమేనియా వెళ్తుందని.. అక్కడ కూడా యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ చిత్రీకరిస్తారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మిలియన్ డాలర్ల' హీరోయిన్ సమంత... ఓవర్సీస్‌లో ఎగబడుతున్నారు...