Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (1-04-2018) మీ రాశి ఫలితాలు.. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి?

మేషం : విందు, వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూర

Advertiesment
ఆదివారం (1-04-2018) మీ రాశి ఫలితాలు.. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి?
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (09:53 IST)
మేషం : విందు, వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం శ్రేయస్కరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం: స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి లోనవుతారు. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. శత్రువులు, మిత్రులుగా మారుతారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఆత్మీయులను విమర్శించడం వలన సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు దెబ్బతింటాయి. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనం వ్యయం అవుతుంది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారికి కలిసిరాగలదు.
 
సింహం : దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 
 
కన్య: ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వారసత్వపు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి ఆశాజనకం. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
తుల: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. పాత మిత్రులతో కలసి విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
వృశ్చికం: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
ధనస్సు: ఒక వ్యాపారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం విద్యా విషయాలు ఆందోళన కలిగిస్తాయి. షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం: పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ధనవ్యయం విపరీతంగా ఉన్నప్పటికీ సార్థకత వుంటుంది. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కుంభం: వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోవద్దు. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మీనం: వ్యాపారాలు, సంస్థల్లో కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచించండి. దూర ప్రయాణాలు చికాకు పరుస్తాయి. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కీలకమైన బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార ఫలితాలు : 01-04-18 తేదీ నుంచి 07-04-18 వరకు....