Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'లేడీ సింగం' సూసైడ్, లైంగిక వేధింపులే కారణం

'లేడీ సింగం' సూసైడ్, లైంగిక వేధింపులే కారణం
, శుక్రవారం, 26 మార్చి 2021 (20:06 IST)
సింగం.. ఈ పేరు చెబితే సూర్య చిత్రం గుర్తుకు వస్తుంది. అందులో మాఫియా ముచ్చెమటలు పట్టించి మట్టుబెట్టేస్తాడు. నిజ జీవితంలో అలాంటి అధికారిగా పేరు తెచ్చుకున్న అటవీశాఖ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లేడీ సింగం అని పిలుచుకునే 28 ఏళ్ల దీపాలి మొహితే తన రివాల్వర్‌తో కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తన ఆత్మహత్యకు కారకులు ఎవరో, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో ఆమె పూసగుచ్చినట్లు లేఖలో రాశారు.
 
ఆ లేఖలో ఆమె ఏమి రాసిందంటే... తన పైఅధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ తనతో గడపాలని వేధించాడని పేర్కొంది. అతడితో గడపనట్లయితే అదనపు డ్యూటీలు వేయడం, వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తను గర్భం దాల్చిన సమయంలో తనను కొండల్లోకి బలవంతంగా లాక్కెళ్లాడనీ, దాంతో తనకు గర్భస్రావమైందని కన్నీటితో తెలిపింది.
 
తనను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా హింస పెట్టాడనీ, ఆ వేధింపులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం తెలుసుకుని శివకుమార్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అతడిని నాగ్ పూర్ రైల్వే స్టేషనులో అదుపులోకి తీసుకున్నారు. కాగా మాఫియాకు సింహిస్వప్నంగా పేరున్న అధికారిణి ఆత్మహత్య చేసుకోవడం మహారాష్ట్రలో చర్చనీయాంశమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌