Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020 కరోనా అటూఇటూ కదలనివ్వలేదు, 2021లో కూడా ప్రకృతి వినాశనమా?

Advertiesment
2020 కరోనా అటూఇటూ కదలనివ్వలేదు, 2021లో కూడా ప్రకృతి వినాశనమా?
, సోమవారం, 28 డిశెంబరు 2020 (19:41 IST)
2020 సంవత్సరం ప్రపంచంలోని మానవాళిలో అధికులను అటుఇటూ కదలనివ్వలేదు. కరోనావైరస్ రూపంలో ప్రజలను ఇళ్లకు పరిమితం చేసేసింది. ఇక అంతా 2021 సంవత్సరం వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ సంవత్సరం నుంచైనా సుఖసంతోషాలతో వుండచ్చని. కానీ కాలజ్ఞానిగా చెప్పబడే బాబా వంగ చెప్పిన విషయాలను చూసి... 2021 సంవత్సరం గురించి కూడా బెంబేలు పడుతున్నారు.
 
ఇంతకీ ఆ బాబా వంగ ఎవరు? అంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఎంత గొప్పదని చెపుతారో అలాగే బాబా వంగ కూడా అలాంటివారేనట. ఈమె బల్గేరియాకు చెందినవారు. ఈమె అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. ఆమెకు 12 ఏళ్ల వయసులో భయంకరమైమ టోర్నడో కారణంగా ఆమె చూపు శాశ్వతంగా పోయింది.
 
ఐతే ఆమెకి అలా చూపు పోయిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే శక్తి వచ్చిందట. విపత్తులు, వైపరీత్యాలు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఆమె ముందుగానే చెప్పేసేవారు. దీంతో అమెకి బాబా వంగ అని బిరుదు ఇచ్చారు. ఆమె చెప్పినవి దాదాపు జరిగాయి. యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణుప్రమాదం, పుతిన్ పైన హత్యాయత్నం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం గురించి కూడా ఆమె చెప్పారు.
 
ఆమె 1996లో కన్నుమూసే ముందుగానే 2021 సంవత్సరంలో ఏం జరుగబోతోందన్నది చెప్పారు. ఈ 2021 సంవత్సరంలో ప్రకృతి విధ్వంసం భారీగా జరుగబోతోందని ఆమె హెచ్చరించారు. ఫలితంగా ప్రజలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అంతేకాదు 2341 నాటికి భూమి నివాస యోగ్యానికి పనికిరాకుండా పోతుందని ఆమె హెచ్చరించింది. ఇంకా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ఓ డ్రాగన్ ప్రయత్నిస్తుందని, దీన్ని అడ్డుకునేందుకు 3 దిగ్గజ దేశాలు ఏకమవుతాయని ఆమె జోస్యం చెప్పింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు రుషికొండ బీచ్ ఎంపిక‌: మంత్రి ముత్తంశెట్టి