Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2021లో మరింత వినాశనమే... బల్గేరియా బాబా జోస్యం...

Advertiesment
2021లో మరింత వినాశనమే... బల్గేరియా బాబా జోస్యం...
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (11:43 IST)
కంటికి కనిపించని వైరస్ ప్రపంచాన్ని అంతలాకుతలం చేస్తుందని ఏనాడో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రూపంలో చెప్పారు. ఇది ఇపుడు నిజమైంది. ఈ ఒక్క సంఘటనే కాదు... ఇలాంటివి అనేకం జరిగాయి కూడా. అయితే, 2020 సంవత్సరంలా మరో సంవత్సరం ఇకపై చూడబోమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ, బల్గేరియాకు చెందిన బాబా మాత్రం 2021 సంవత్సరం కూడా మరింత వినాశనాన్ని కలిగిస్తుందని చెబుతున్నాడు. 
 
నిజానికి ఈ బల్గేరియా బాబాకు స్థానికంగా మంచి పేరుంది. ఈమె పూర్తిపేరు బాబా వంగా, బల్గేరియా దేశంలో ఆయన చెప్పే భవిష్యత్తుపై ఆ దేశ ప్రజలకు అంత నమ్మకం ఉంది. ఇపుడు 2021 సంవత్సరం గురించి మరో విషయం చెబుతున్నాడు. అంతేకాదు తను చెప్పినవాటిలో కొన్ని జరుగుతున్నాయి కూడా. 
 
టోర్నడో వల్ల 12 ఏళ్లకే చూపు కోల్పోయిన వంగ.. ఆ తర్వాతి కాలంలో కాలజ్ఞానం చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చెప్పినవి జరగడంతో, తనను బల్గేరియాలో నోస్ట్రడామస్‌(ఫ్రెంచ్‌ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేయగా, తాజాగా 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది.
 
బాబా వంగ కాలజ్ఞానం ప్రకారం 2021 ఏమాత్రం ఆనందకరంగా ఉండదట. తను 5079 వరకు భవిష్యత్తును అంచనా వేయగా.. యువరాణి డయానా మరణం, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, చెర్నోబిల్‌ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం, అమెరికా అధ్యక్షుడు చావు అంచుల దాకా వెళ్తాడనడం.. ఇలా అన్నీ జరిగాయి. 
 
ఇక 2021లో కేన్సర్‌కు మందు లభిస్తుందని వివరించగా, ఈ ప్రపంచాన్నంతటినీ ఓ డ్రాగన్‌ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని ఆమె తన కాలజ్ఞానంలో చెప్పింది. అయితే ఫ్రాన్స్ జ్యోతిష్కుడు, తత్వవేత్త అయిన నోస్ట్రడామస్ కూడా 2021 మరింత వినాశకరంగా ఉంటుందనీ, భూకంపాలు వస్తాయని చెప్పాడు. 
 
అయితే వంగ బాబా రాతపూర్వకంగా స్వయంగా ఏదీ రాయలేకపోవడంతో, ఆమె చెప్పిన వాటిలో చాలా వరకూ కల్పించినవేనని కొందరి వాదన. కొందరు మాత్రం ఆమె చెప్పినవన్నీ జరిగినపుడు, ఇవి మాత్రం ఎందుకు జరగవని అభిప్రాయపడుతున్నారు. కాగా బాబా వంగ 1996లో మరణించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!