టివి9 ఛానల్ సిఈఓ రవిప్రకాష్ వ్యవహారం ఏ స్థాయిలో చర్చకు దారితీసిందో చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను నెంబర్ 1 ఛానల్‌గా ఎదిగిన టివి9కు వ్యవస్థాపకుడే రవిప్రకాష్. అలాంటి ఛానల్ నడుపుతున్న రవిప్రకాష్ మెరుగైన సమాజం కోసం తన ప్రయత్నమంటూ రకరకాల మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి రవిప్రకాష్‌కు బాడ్ టైం స్టార్టయ్యింది.
అందుకు ప్రధాన కారణం ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలను రవిప్రకాష్ నొక్కేశారన్న ఆరోపణలే. ఇది కాస్త ఆ సంస్థలోని డైరెక్టర్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో రవిప్రకాష్‌ను సిఈఓ పదవి నుంచి తొలగించి కొత్త సిఈఓ, కొత్త సిఓఓలను నియమించారు. దీంతో రవిప్రకాష్ కేవలం డైరెక్టర్లలో ఒకరిగా మాత్రమే మిగిలిపోయారు. అందులోను 10 శాతం షేర్స్ మాత్రమే రవిప్రకాష్‌కు టివి9లో ఉంది. దీంతో ఛానల్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రవిప్రకాష్ పెద్దగా తలదూర్చే అవకాశం లేదు.
ఇదంతా జరుగుతుండగా ఇందులో మరో కీలక పాత్రధారి కూడా ఉన్నారు. ఆయనే నటుడు శివాజీ. రవిప్రకాష్ ఫోర్జరీకి శివాజీ సహకరించారన్న ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శివాజీ అఫ్రూవర్‌గా మారిపోవడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.