Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పృథ్వీరాజ్ కథ పట్టుకుని 18 ఏళ్ల పాటు పరీక్షించాను: దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది

Akshay Kumar
, సోమవారం, 2 మే 2022 (19:39 IST)
సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కథానాయకునిగా, తెరకెక్కిన భారీ అంచనాల తదుపరి చిత్రం, యశ్ రాజ్ ఫిలింస్ వారి పృథ్వీరాజ్‌కు ప్రముఖ చలనచిత్ర నిర్మాత, చరిత్రకారుడు డా. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రాతో బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకునే ముందుగా ఈ కథతో తాను 18 ఏళ్లు ప్రయాణం చేశానని దర్శకుడు పేర్కొన్నారు.
 
దీని గురించి చంద్రప్రకాష్‌ మాట్లాడుతూ, ‘‘పృథ్వీరాజ్‌ నా కలల ప్రాజెక్ట్‌. నేను ఈ శక్తివంతమైన, చరిత్రపుటల్లో నిలిచిన మహారాజు గురించి సినిమా తీసేందుకు ప్రయత్నించడానికి ముందుగా విస్తృతమైన పరిశోధనను ప్రత్యేకంగా ఉండాలని నేను చాలా కాలం పాటు శ్రమించి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కచ్చితంగా చెప్పాలంటే, పృథ్వీరాజ్ తుది పరిశోధనలో నేను ప్రతి ఒక్క వాస్తవాన్ని పలుసార్లు తనిఖీ చేశానని పూర్తిగా సంతృప్తి చెందేందుకే దాదాపు ఆరు నెలలు పట్టింది’’ అని వివరించారు.
 
దీని గురించి మరింత వివరిస్తూ, “మా సినిమాలో సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్‌కి న్యాయం చేస్తున్నామనే భరోసా కోసం నేను ఆయన జీవితానికి సంబంధించిన చాలా పుస్తకాలు చదివాను. నేడు, నేను నా కలను సాకారం చేసుకునేందుకు ముందుగా, ఇంత సమయాన్ని తీసుకున్నందుకు రచయితగా, దర్శకునిగా నేను చాలా సంతృప్తి చెందాను. మన చరిత్రలో పృథ్వీరాజ్ లాంటి సామ్రాట్ లేడు. మా సినిమా అతని పరాక్రమానికి, గొప్ప జీవన విధానానికి తగిన నివాళి అని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో: హీరో విశ్వక్ సేన్ పైన గావుకేకలు పెట్టిన లేడీ యాంకర్