Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘దహనం’ ట్రైలర్‌ విడుదల చేసిన ఎంఎక్స్‌ ప్లేయర్‌

Advertiesment
MX Player
, శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (16:01 IST)
ఎముకలలో సైతం వణుకు పుట్టించేలా యాక్షన్‌ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన రామ్‌గోపాల్‌ వర్మ మరోమారు పూర్తి యాక్షన్‌ కథాంశంతో తిరిగిరాబోతున్నారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంలో తీర్చిదిద్దబడిన కథాంశాన్ని ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్‌ ప్లేయర్‌ తీసుకురానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

 
ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అశ్వత్‌కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్‌, సయాజీ షిండే మరియు ప్రదీప్‌ రావత్‌లు అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు. అత్యంత ఆసక్తి కలిగించే ఈ డ్రామాకు సంబంధించిన ఎపిసోడ్లు అన్నీ కూడా ఎంఎక్స్‌ ప్లేయర్‌ వద్ద 14 ఏప్రిల్‌ 2022 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానున్నాయి.

 
ఈ ఆకర్షణీయమైన ట్రైలర్‌లో ఓ కమ్యూనిస్ట్‌ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు. అది గ్రామంలో ఏవిధంగా సంచలనంగా మారింది చెబుతారు. శ్రీరాములు పెద్ద కొడుకు హరి, ఓ విప్లవకారుడు (నక్సలైట్‌). అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భూస్వాములతో చేస్తుంటాడు. అతను తన తండ్రి మరణవార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గూండాలకు, అతనికి జరిగే పోరాటం ఆసక్తి రేకెత్తిస్తుంది. దీనికితోడు నక్సలైట్ల ఆధిపత్యం గ్రామంలో పెరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలూ పెరుగుతాయి. తన తండ్రి మరణానికి కారకులైన వారిపై హరి పగతీర్చుకున్నాడా?

 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ షో గురించి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ, ‘‘నా మొట్టమొదటి వెబ్‌ సిరీస్‌ ‘దహనం’ను ఎంఎక్స్‌ ప్లేయర్‌ భాగస్వామ్యంతో రూపొందించడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుంది. అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమ’ని మహాత్మాగాంధీ చెబుతారు.

 
కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుంది. ‘దహనం’ వెబ్‌ సిరీస్‌లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించాము. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు, కానీ థ్రిల్లింగ్‌ క్రైమ్స్‌తో కూడినది. ఊపిరిబిగపట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ షోతో మేము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్‌ చేసిన తీరుతో తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల అద్భుత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగాం. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మా మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని అన్నారు.

 
దహనంను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు. ఈ ఎపిసోడ్స్‌ అన్నీ కూడా ఎంఎక్స్‌ ప్లేయర్‌పై పూర్తి ఉచితంగా చూడవచ్చు. ఈ సిరీస్‌ 14 ఏప్రిల్‌ 2022 నుంచి ప్రసారం కానుంది. ఇప్పుడే ఎంఎక్స్‌ ప్లేయర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌  చేసుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకో భీమ్లా నాయక్ బైక్ గెలుచుకో