Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రాధేశ్యామ్‌' కథలో దమ్ము లేదా? : ఆర్జీవీ కామెంట్స్ ఏంటి? (video)

Advertiesment
'రాధేశ్యామ్‌' కథలో దమ్ము లేదా? : ఆర్జీవీ కామెంట్స్ ఏంటి? (video)
, గురువారం, 17 మార్చి 2022 (16:12 IST)
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైశైలిలో కామెంట్స్ చేశారు.
 
"రాధేశ్యామ్" గురించి ఆయన మాట్లాడుతూ, హీరో ప్రభాస్ పారితోషికం పక్కనబెడితే ఈ చిత్రాన్ని మొత్తం బడ్జెట్‌లో ఐదో వంతు ఖర్చుతో తీయొచ్చన్నారు. సినీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అక్కర్లేదన్నారు. కథలోని ఎమోషన్స్‌ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుందని అభిప్రాయపడ్డారు. దమ్మున్న కథ కవాలన్నారు. 
 
బాలీవుడ్ చిత్రం "ది కశ్మీర్ ఫైల్స్" గురించి ఆ చిత్రం విడుదలయ్యేంత వరకు ఏ ఒక్కరికీ తెలియదన్నారు. అలాగే, ఈ చిత్రాన్ని కేవలం 4 లేదా 5 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారని గుర్తుచేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని గుర్తుచేశారు. శుక్రవారానికి ఈ కలెక్షన్లు రూ.100 కోట్లను క్రాస్ చేసేలా ఉన్నాయని తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న బిచ్చగాడు 2 థీమ్ సాంగ్