రామ్ గోపాల్ వర్మ అంటే పబ్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు. అమ్మాయిలతో డాన్స్‌లు చేస్తూ, మందుకొట్టి కాళ్ళకు నమస్కారం కొడుతూ ఇలా ఎన్నో విచిత్రాలు చేస్తాడు. ఇదంతా కేవలం ఎఫెక్ట్ కోసమే చేస్తుంటాడట. ఈ విషయాన్ని వర్మ సోదరి విజయలక్ష్మి తెలియజేసింది. గతంలో వర్మ తీసిన సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుకలకు తన తల్లిని, సోదరిని కూడా తీసుకువచ్చేవారు. వారి ముందే అమ్మాయిల గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తాడు. ఇవన్నీ వాళ్ళకు తెలుసట. కానీ, ఇటీవల అమ్మాయిలతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో గురించి సోదరి క్లాస్ పీకిందట. దానికి నా గురించి చిన్నతనంనుంచి తెలుసుకదా. అది కేవలం ఎఫెక్ట్ కోసమే అని చెప్పాడని.. ఇటీవలే ఓ యూ ట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలియజేసింది.
వర్మ అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో కామెంట్ చేసేవాడట కాలేజీ రోజుల్లో. ఒకసారి తన స్నేహితురాలిని బాగున్నావని అంటే, ఆమె వచ్చి నాకు చెప్పింది. నేను వర్మను అడిగాను. దానికి మెల్లకన్ను .. అది నీకు ఎలా నచ్చింది అని.. అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను అని చెప్పాడు. అలాగే వర్మ అమ్మాయిలతో డాన్స్ వేయడం కూడా అలాంటిదే అని వర్మ సోదరి చెబుతోంది. సో. వర్మలో అసలు విషయం లేదనుకుంటా. అందుకే డాన్స్‌ల వరకే వారితో ఎంజాయ్ చేస్తున్నాడని అర్థమవుతోంది. అందుకే వర్మ ఆలోచనలకు సూట్ అమ్మాయిలే ఆయనతో డాన్స్‌లు వేస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేయడం హైలైట్.