Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''అయోగ్య'' స్టెప్పులేయనున్న సన్నీలియోన్..

Advertiesment
''అయోగ్య'' స్టెప్పులేయనున్న సన్నీలియోన్..
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:05 IST)
పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్‌కు ప్రస్తుతం దశ తిరిగింది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి కూడా వచ్చేసిన సన్నీకి ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. సన్నీలియోన్. వీరమహాదేవి అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలోనూ సన్నీ నటిస్తోంది. 
 
త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తుంది . ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది. 
 
తాజాగా స‌న్నీ ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి చిత్రం మ‌ధుర రాజాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. అలాగే మలయాళంలో స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో బ్యాక్ వాట‌ర్ స్టూడియోస్ పతాకంపై జ‌య‌లాల్ మీన‌న్ నిర్మాణంలో ద‌ర్శ‌కుడు సంతోష్ నాయ‌ర్ సినిమాలో సన్నీ లియోన్ నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి రంగీలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ గోవాలో ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో స్పెషల్ సాంగ్ చేసిన సన్నీలియోన్.. మరో స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్ చేసేందుకు సై అంటోంది. ప్రస్తుతం విశాల్ "అయోగ్య" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో విశాల్‌తో కలసి ఓ ఐటెం సాంగ్‌లో సన్నీ చిందేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌ద్మ‌శ్రీ చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్... ఎవ‌రీ చింత‌కింది మ‌ల్లేశం..?