Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టు రూమ్ డ్రామాతో తక్కువ సినిమాలు వచ్చాయి, ఉద్వేగం బెస్ట్ చిత్రం అవుతుంది : రామ్ గోపాల్ వర్మ

Advertiesment
Trigun, varam and team

డీవీ

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (08:56 IST)
Trigun, varam and team,madhu, shankar
కళా సృష్టి ఇంటర్నేషనల్, మని దీప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మహిపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఉద్వేగం ఫస్ట్ కేసు. ఈ చిత్రానికి శంకర్ లుకలపుమధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రిగున్ ప్రాధాన పాత్రలో, శ్రీకాంత్ అయ్యంగార్ విభిన్న పాత్రలో నటిస్తున్న ఉద్వేగం చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడువలైంది. ప్రముఖ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో త్రిగున్, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, ఐడ్రీమ్ అంజలి తదితరులు నటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. కోర్టు  రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ట్రైలర్ చూసిన తరువాత చాలా సిన్సియర్ అటెప్ట్ అనపించిందని ఆర్జీవి అన్నారు. అంతే కాకుండా చాలా సహజంగా యాక్టింగ్ చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు పరిశ్రమలో వండర్ క్రీయేట్ చేయబోతుందని పేర్కొన్నారు. ముందుగానే సినిమా దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అలాగే యాక్టర్ అదిత్య 25వ చిత్రం, అలాగే త్రిగున్ సైతం 25వ చిత్రం ఉద్వేగం అని, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి యాక్టర్స్ ఈ చిత్రంలో పని చేయడం గ్రేట్ అని ఆర్టీవీ పేర్కొన్నారు. కోర్టు రూమ్ డ్రామాలు విజువల్‌గా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయని, ఈ చిత్రం ట్రైలర్ చూసినప్పుడు అదే ఉద్వేగాన్ని కలిగించిందని ఆర్జీవీ తెలిపారు.
 
కోర్టు రూమ్ డ్రామాల్లో మంచి సస్పెన్స్ ఉంటుంది. తెలుగులో వచ్చిన వకీల్ సాబ్ చిత్రం తరువాత అంత డ్రామా, సస్పెన్స్ ఉన్న చిత్రం ఉద్వేగం అవుతుందని తెలుస్తుంది. టీజర్ చూస్తే కచ్చితంగా ఓ కొత్త ములుపును సినిమాలో చూపించబోతున్నట్లు అనిపిస్తుంది. టీజర్‌లో విడుదల చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్స్ సైతం ఉన్నట్లు టీజర్ చూస్తే అనిపిస్తుంది. ఇక లా ను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ తో పాటు నాలెడ్జ్ కూడా అందిస్తుందని అర్థం అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు భాష, సంస్కృతికి వెలుగు తేవాలనే ఎన్.టి. ఆర్.తో చిత్రం చేస్తున్నా : వైవిఎస్ చౌదరి