Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్థిరమైన ఆదాయం, భవిష్యత్ మీద భరోసా ఉండని వారే దర్శకుడు : విజయ్ దేవరకొండ

Vijay Devarakonda

డీవీ

, సోమవారం, 29 జులై 2024 (10:29 IST)
Vijay Devarakonda
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఈ రోజు దర్శకుల సంఘం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా డ్రీమర్స్. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు, భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు. ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్ కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
 
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు. మేము ఈసారి ఎలక్షన్స్ లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్. సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. ఈ రోజు మా ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇతర పెద్దలంతా అతిథులుగా పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"రాజా సాబ్" అప్డేట్ వచ్చేసింది.. గ్లింప్స్‌ విడుదల ఎప్పుడంటే?