Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు భాష, సంస్కృతికి వెలుగు తేవాలనే ఎన్.టి. ఆర్.తో చిత్రం చేస్తున్నా : వైవిఎస్ చౌదరి

YVS , Sai Madhav, chandrabose, geeta

డీవీ

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (08:44 IST)
YVS , Sai Madhav, chandrabose, geeta
హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు ను వెండి తెరకు పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి చిత్రం తెస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 1980 నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి, హైందవ విలువ తెలిపే చిత్రంగా  వుంటుందని వైవిఎస్ చౌదరి ప్రకటించారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను  "న్యూ టాలెంట్ రోర్స్ @" బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
 
ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సృష్టిలో ప్రతి శబ్దాన్ని అక్షర రూపంలో రాగలిగే భాష తెలుగు. ఈ సినిమా కథా 1980 నేపథ్యంలో జరగబోతోంది. ఈ నేపథ్యం బలీయమైన తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం ఇది. తెలుగు భాషా, సంస్కృతి, విలువలు గురించి చెప్పాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు వున్న అంశాలు వున్నప్పడే ఇలాంటి కథ చెయ్యాలి. అలాంటి వాణిజ్య విలువలు అన్నీ కుదిరిన కథ ఇది. తెలుగు భాషా దినోత్సవం రోజున, గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం పురస్కరించి ఈ నేపధ్యం ప్రకటించడం చాలా ఆనందంగా వుంది మరిన్ని వివరాలు తర్వాత తెలుపుతాను అన్నారు   
 
గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'తెలుగు భాష తియ్యదనం. తెలుగు జాతి గొప్పతనం. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం' అని ఒక పాటలో రాశాను.  ఈ సినిమాలో మరింత అందమైన అర్ధవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతోంది. చౌదరిగారితో నా ప్రయాణం సీతయ్య సినిమాతో ప్రారంభమైయింది. నాకు ఎన్నో చక్కని అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకి, భాషకి అందిస్తాననే విశ్వసం వుంది' అన్నారు.  
 
 రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ఇప్పుడు తెలుగు మాట్లాడితే తల్లితండ్రులు, టీచర్లు కొప్పడే పరిస్థితి తెలుగులోనే వుంది. సమాజాన్ని నిర్మించేది తల్లితండ్రులు ఉపాధ్యాయులు. ఇప్పుడున్న సమాజం ఇలానే కొనసాగితే ఉనికి కోల్పోయే పరిస్థితి వుంటుంది. తెలుగు గొప్ప భాష. పద్యం తెలుగుకే సొంతం. ఇప్పుడున్న సమాజంలో మార్పు రావాలంటే తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తెలుగు నేర్పించండి' అని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నా స్పీడ్ తలా! 234 కిమీ వేగంతో హీరో అజిత్ డ్రైవింగ్!