శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి, ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై గుడ్ ఫ్రెండ్స్- బొడ్డు అశోక్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు బెల్లకొండ సురేష్, అచ్చిరెడ్డి, యంఎల్ కుమార్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదలచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ - ``క్రేజీ అంకుల్స్ ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీతో గుడ్ సినిమా గ్రూప్‌కి బాగా డబ్బులు వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ``గుడ్ సినిమా గ్రూప్‌తో అనుబందం `ఈ రోజుల్లో సినిమాతో మొదలైంది. ఆ అనుబందంతోనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సారి సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతుంది. అందులో భాగంగా ఎంటర్టైన్‌మెంట్ పుష్కలంగా ఉన్న క్రేజీ అంకుల్స్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ప్రముఖ నిర్మాత యంఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ -`` `ఈ రోజుల్లో` సినిమా ఓపెనింగ్‌కి నేను, అచ్చిరెడ్డిగారు, సురేష్ గారు రావడం ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో శ్రేయాస్ శ్రీనివాస్ గారు సెంటిమెంట్‌గా భావించి మళ్లీ మా ముగ్గురిని ఈ ఈవెంట్‌కి గెస్ట్‌లుగా ఆహ్వానించారు. ఈ సినిమాలో చాలా అద్బుతమైన కాంబినేషన్ కుదిరింది. సత్తిబాబు గారు ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్. ట్రైలర్ చాలా బాగుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ, `నేను ఈమధ్య కాలంలో చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ ఇది. షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీవాస్‌గారు, డార్లింగ్ స్వామి గారు, ఇవివి సత్తిబాబు గారు చాలా కష్టపడ్డారు. ఔట్ అండ్ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. రఘుకుంచే మంచి సంగీతం ఇచ్చారు`` అన్నారు.
నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ - ``శ్రేయాస్ శ్రీను గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న టైమ్‌లో నాకు రైటర్ డార్లింగ్ సామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. పాజిటీవ్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరి గుడ్ సినిమా గ్రూప్ స్థాపించడం జరిగింది. వాళ్లందరూ కలసి ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
చిత్ర దర్శకుడు ఇ. సత్తిబాబు మాట్లాడుతూ - ``క్రేజీ అంకుల్స్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ అందరం ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది`` అన్నారు.
సంగీత దర్శకుడు రఘుకుంచె మాట్లాడుతూ, ``ఈ సినిమాలో 40+ ఉన్నవారందరికోసం మంచి పాట కంపోజ్ చేయడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన చిత్రమిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి రోల్స్ ఆడియన్స్ ను అలరిస్తాయి``అన్నారు. శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పై, మహేంద్ర నాథ్, సిందూరి, మాధురి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి... కథ, మాటలు: డార్లింగ్ సామి,
సినిమాటోగ్రఫీ: పి. బాల్‌రెడ్డి,
సంగీతం: రఘు కుంచె,
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి,
ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి,
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే,
స్టిల్స్: పిల్.గణపతి,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అడ్డాల శ్రీనివాస్, ఆనంద్ తాళ్లూరి,
లైన్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి,
ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని,
ప్రజెంట్స్: కిరణ్ కె తలసిల,
కోప్రొడ్యూసర్: లయన్ వై కిరణ్,
ప్రొడ్యూసర్స్: గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్,