"ఉప్పెన" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు.. అటు కోలీవుడ్‌లో సైతం ఈ భామకు మూవీ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.60 లక్షలకు పెంచేసింది. ఇపుడు కోటి రూపాయలు కావాలంటోంది. దీంతోపాటు పలు రకాలైన కండిషన్లు పెడుతోంది. ఈ కండిషన్లు విన్న నిర్మాతలు షాకవుతున్నారు.
మెగా మేనల్లుడువైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన "ఉప్పెన'' సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మార్కును క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బేబమ్మగా నటించిన కృతిశెట్టి తెలుగు ఆడియెన్స్‌ను తన క్యూట్‌లుక్స్‌తో ఫిదా చేసేసింది. దీంతో నిర్మాతలు కృతిశెట్టిని తమ సినిమాలో నటింప చేస్తే బావుంటుందని క్యూ కట్టారు.
తొలి సినిమాకు ఆరు లక్షలు.. అక్కడి నుంచి వెంటనే అరవై లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న కృతిశెట్టి.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడుగుతుందట. రీసెంట్‌గా ఓ స్టార్ నిర్మాత తన సినిమాలో నటించాలంటూ కృతిశెట్టిని సంప్రదించాడట. కృతిశెట్టి కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
సరే! అని నిర్మాత అనుకున్నాడట. అయితే కృతి శెట్టి పెట్టిన కండీషన్స్ విని షాక్ అయ్యాడట. అసలు కంటే కొసరెక్కువ అయ్యేలా ఉందే అనుకుని సదరు స్టార్ ప్రొడ్యూసర్ బయటకు వచ్చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై కృతిశెట్టి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.