Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ అరంగేట్రం.. సాయిపల్లవికి బంపర్ ఆఫర్

Advertiesment
Sai Pallavi
ఫిదా భామ సాయిపల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే నాయికలకు బాలీవుడ్‌ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్న మాదిరిగానే సాయిపల్లవికి కూడా ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కిందని సమాచారం. 
 
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను చాలా గుట్టుగా ఉండేలా నిర్మాణ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఈ సినిమాలో సాయిపల్లవి ఏ స్టార్‌కి జోడీగా నటించనుంది?, దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. 
 
అయితే ఈ సినిమాతో సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ మాత్రం ఖాయమన్నట్టు తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన 'లవ్‌ స్టోరి', 'విరాట పర్వం' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే నాని 'శ్యామ్‌ సింగ రాయ' చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆది సాయికుమార్ హీరోగా నూతన చిత్రం