Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని విడుదల చేసిన `లోల్ స‌లామ్‌` ట్రైలర్‌

Advertiesment
నాని విడుదల చేసిన `లోల్ స‌లామ్‌` ట్రైలర్‌
, శనివారం, 12 జూన్ 2021 (16:47 IST)
Lol salam
విభిన్నమైన కథాంశంతో కూడుకున్న కొత్తరకం ప్రయత్నాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్‌ బాగుంటే అది సినిమా అయినా వెబ్‌సిరీస్‌ అయినా ఆదరణలో ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో  వైవిధ్యమైన కథాంశంలతో పలు వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఓ చక్కటి కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ‘లోల్ సలామ్‌’ పేరుతో జీ-5ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సీరిస్‌ రాబోతుంది. 
 
ఆరు ఏపిసోడ్స్‌లతో పూ ర్తివినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్‌సీరిస్‌ జీ-5 ఓటీటీలో ఈ నెల 25న విడుదల కాబోతుంది. కాగా ఈ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేసి తన శుభాకాంక్షలు అందజేశాడు. ఈ వెబ్‌సీరిస్‌ విశేషాలను క్రియేటర్‌ అండ్‌ డైరెక్టర్‌ నాని తెలియజేస్తూ, కరోనాతో ఒత్తిడితో వున్న అందరిని పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయడమే మా ధ్యేయం దైనందిన జీవితంలో వున్న టెన్షన్‌లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో అనుకోకుండా ఒకరు ఆ  అడవిలో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వా ళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అనేది పూ ర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాం. 40 కొత్త ఆర్టిస్టులతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాం’ అని తెలిపారు  ఈ వెబ్‌సీరిస్‌కు మ్యూజిక్‌: అజయ్‌ అరసాడ, సినిమాటోగ్రఫీ: రాకేష్‌ ఎస్‌ నారాయణ, ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల, కథ-మాటలు: అర్జున్‌-కార్తీక్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోక్ష‌జ్ఞ హీరో, నేనే డైరెక్టర్: కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాల‌కృష్ణ‌